ప్రశాంతంగా ఓపెన్ కోర్సు ఆంగ్ల పరీక్ష


Fri,April 26, 2019 01:58 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ లలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో గోవిందరాజులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలకు గానూ 8 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి కి 693 మంది విద్యార్థులకు గానూ 607 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 86 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 753 మంది విద్యార్థులకు 676 మంది హాజరు కాగా 77 మంది గైర్హాజరయ్యారన్నారు. డీఈవో వెంట పరీక్షల నిర్వాహణాధికారి రాజశేఖర్, ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...