ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి


Thu,April 25, 2019 03:59 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : జిల్లాలో నిర్వహించనున్న పరిషత్ ఎన్నికలు శాంతియుత వాతవరణంలో నిర్వహించాలని పరిషత్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు పౌసమిబసు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు రూపొందించిన బందోబస్తు ప్రణాళిక, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, వివిధ నోడల్ కమిటీల బాధ్యతలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా స్వేచ్ఛాయుత వాతవరణంలో ఓటర్లు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు, బ్యాలెట్ పేపర్ ముద్రణలో ఎలాంటి తప్పులు జరుగకుండా చూడాలన్నారు. లా ఆండ్ ఆర్డర్‌కు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పత్రికలలో ప్రచురితమయ్యే అడ్వైర్టెజ్‌మెంట్, పేయిడ్ న్యూస్‌లను కూడా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు గాను జిల్లాలో పది నోడల్ కమిటీలు నియమించి నోడల్ అధికారుల ద్వారా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. మొత్తంగా 1,178 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. 29, 30 తేదీల్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. 80 పోలింగ్ కేంద్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రం వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో జేసి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్పీ చెన్నయ్య, జిల్లా పంచాయతి అధికారి సురేష్‌మోహన్, ఆర్డీవోలు హనుమానాయక్, పాండునాయక్, రాజేష్‌కుమార్, నోడల్ అధికారులు జోజి, అంజిలప్ప, గోవిందరాజులు, అనిల్ ప్రకాష్, ఎర్రిస్వామి, సాయిసుమన్ పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...