అంకిత భావంతో పనిచేయాలి


Thu,April 25, 2019 03:58 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : అంకిత భా వంతో పనిచేసి గ్రామాభివృద్ధికి పాటు పడాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ పంచాయతీ కార్యదర్శులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని ఎస్‌జేఆర్ ఫంక్షన్ హాల్‌లో నూ తనంగా బాధ్యతలు చేపట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో సురేష్‌మోహన్, డీఈవో గోవిందరాజు మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బృహత్కర బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. గ్రా మాలే దేశానికి పట్టు గొమ్మలని, గ్రామీణాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఏ కా ర్యక్రమం చేపట్టినా ప్రజల కోసమే రూ పొందించబడుతుందన్నారు. గ్రామాభివృద్ధికి రూపొందించిన పథకాలు ప్రజలకు చేరవేసేందుకు గ్రామీణ స్థాయిలో ప్రభు త్వ పథకాల అమలు పర్యవేక్షించేందుకు, ప్రజల సమస్యలు తక్షణమే స్పందించేందుకు గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధిగా గ్రామపంచాయతీ అధిపతిగా కార్యదర్శులు ఉంటారన్నారు. గ్రామపంచాయతీ అధిపతిగా ప్రజలకు బాధ్యునిగా సర్పంచ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వులు ఇతర సమాచారం అందక ప్రజ లు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడే వారన్నారు.

గ్రామ స్థాయిలో అన్ని ప్రభు త్వ శాఖలను సమన్వయ పరిచి సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అం దించేందుకు వారధిగా ఒక ప్రభుత్వ ఉ ద్యోగి ఉండాల్సిన అవసరం గుర్తించిన ప్ర భుత్వం వివిధ రాష్ర్టాల్లో గ్రామపంచాయతీల పరిపాలన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శి పోస్టును సృష్టించి 2002 నుంచి ఈ వ్యవస్థను అమలులోకి తెచ్చిందన్నారు. ప్రతి గ్రామపంచాయతీ, సర్పం చ్ ఆదేశాల మేరకు పంచాయతీని సమావేశ పర్చాల్సి ఉంటుందన్నారు. పంచాయతీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు కార్యదర్శి తప్పకుండా హాజరు కమిటీల తీర్మాణాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ, పంచాయతీ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలన్నారు. ప్ర భుత్వ భూములు, భవనాలు, ఇతర ఆస్తు లు అన్యాక్రాంతమైనప్పుడు ఇతరులు దు ర్వినియోగం చేసినప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. పంచాయతీ రిజిష్ట్రర్లు నిర్వహించాలని, పన్నులను సక్రమంగా వసూలు చేయాలన్నారు. గ్రామ రికార్డులు, అకౌంట్‌లతోపాటు జనన మరణాల రిజిష్ర్టార్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగ్గా గ్రామస్థాయిలోనే విధిగా ఉండి గ్రామాభివృద్ధికి పాటు పడాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించి బడిబయటి పిల్లల వివరాలను ఉపాధ్యాయులతో సేకరించి వారి తల్లిదండ్రులకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియ పర్చే బాధ్యతను కార్యదర్శులు తీసుకోవాలన్నారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో మాట్లా డి అవసరమైన మౌళిక సదుపాయాలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కల్పించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని 20 మండలాల్లో ఇటీవల నూతనంగా విధులు స్వీకరించిన 266మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...