సారూ.. కనికరించరూ..!


Thu,April 25, 2019 03:58 AM

మానవపాడు: రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. అధికారులు చిన్నపాటి సమస్య ఉన్నా పరిష్కరించకుండా పార్టు-బీలో ఉంచి రైతులకు నరకయాతన చూపిస్తున్నారు. రైతులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారి సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. వీఆర్వో నిర్వాకంతోనే మాకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు మోహన్, మల్లయ్య, బాబు, బిలాల్, రేణుక, గురుపాద, మద్దిలేటి నమస్తే తెలంగాణతో తమ గోడు వెల్లబోసుకున్నారు. అమరవాయి, మానవపాడు, పెద్ద ఆందాలపాడుకు చెందిన రైతులు పెద్ద ఆందాలపాడు శివారులోని 104, 105 సర్వే నంబర్లలో బాబన్న ఎకరా, మద్దిలేటి ఎకరా, మోహన్ రెండెకరాలు, అబ్దుల్ రెహమాన్ సాహెబ్ నాలుగెకరాలు, రేణుక రెండెకరాలు, మల్లయ్య ఎకరా, గురుపాద ఎకరా కొనుగోలు చేసి రిజిష్ర్టేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనలో రైతుల పొలాలను వీఆర్వో రవీందర్‌రెడ్డి పార్టు-బీ కింద ఉంచారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్, ఓఆర్‌సీ పత్రాలు అందజేశారు. ఏడాదిగా రైతులు ఆన్‌లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని తిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ ఒక చోట, పొజిషన్‌లో మరో చోట ఉందని వీఆర్వో వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోతున్నారు. రైతులు 6 నెలల క్రితం సర్వే చేయించుకుని రిపోర్టు అందజేశారు. అయినప్పటికి వీఆర్వో ఆన్‌లైన్ చేయకుండా వేధిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...