ఏళ్ల తరబడి తిరుగుతున్నాం


Thu,April 25, 2019 03:57 AM

హన్వాడ: 30 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాం.. మా పేర్ల మీద పట్టా చేసి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలోని 118 సర్వే నంబర్‌లో 90ఎకరాల భూమిని 40 దళిత, గిరిజన కుటుంబాలు కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. ఆ భూమిపై బ్యాంకులో పంట రుణాలు కూడా తీసుకున్నారు. గతంలో తీసుకున్న రుణాలు మాఫీ అయ్యాయి. ఆ భూమి ఫారెస్టుకు సమీపంలో ఉండడంతో ఫారెస్టు అధికారులు వారి హద్దుల వరకు ఫినిషింగ్ చేసుకున్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూమి రెవెన్యూ అధికారులతో సర్వే కూడా చేయించారు. సర్వే రిపోర్టు ఆర్‌ఐ తమకు ఇవ్వడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కానీ, 20మంది గిరిజనులకు మాత్రం అటవీహక్కుల పత్రం ఇచ్చారు. మిగతా 20మంది దళితులకు నేటివరకు ఎలాంటి పత్రాలు ఇవ్వడంలేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఇస్తారు.. మరికొందరికి ఇవ్వరా..? అని ప్రశ్నిస్తున్నారు. తమకు పట్టా చేసి పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా మా సమస్యలు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఒక్కొక్కరికీ రెండు నుంచి మూడెకరాల భూమి వస్తుందన్నారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా సాగులో ఉన్నారు.. వారికి పట్టా చేసి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...