కలెక్టర్ చెప్పినా.. న్యాయం జరగలే..


Thu,April 25, 2019 03:57 AM

అమ్రాబాద్ రూరల్: మండలంలోని మాచారం గ్రామానికి చెందిన నారుమొల్ల లింగయ్యకు 1987-88లో అడగంల్ పహాణి ప్రకారం సర్వే నంబర్ 74/ఇ 4.07 ఎకరాలు, సర్వే నంబర్ 81/ఇ 1.28 ఎకరాలు, సర్వే నంబర్ 88/అ లో 3.18 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డులో నమోదైంది. ఈయనకు ముగ్గురు కుమారులు నారుమెల్ల బాలయ్య, నారుమెల్ల రామస్వామి, నారుమెల్ల ఉస్సేన్ ఉన్నారు. తన తండ్రి పేర ఉన్న భూమి వారసత్వంగా ముగ్గురికి సమానంగా భూ పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, ముగ్గురిలో పెద్ద కుమారుడు నారుమొల్ల బాలయ్య మరణించాడు. దీంతో మిగిలిన ఇద్దరికి అధికారులు భూమిని సమానంగా భాగపరిష్కారం చేయాలి. కానీ, ఎవరైతే రెవెన్యూ అధికారులకు చేతులు తడిపారో వారికే ఉన్న భూమి మొత్తాన్ని పట్టా చేశారని బాధిత రైతు నారుమొల్ల రామస్వామి, ఆయన భార్య ఎంకమ్మ తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. 9.7 ఎకరాల భూమిని నారుమొల్ల ఉస్సేన్, ఆయన భార్య మణెమ్మకు అక్రమంగా పట్టా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మాకు అన్యాయం జరిగిందని 20ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో 2002, 2006లో భూమిని ఇద్దరికి సమభాగాలు పట్టా చేసుకోవాలని తీర్మాణం చేసినా వారు పట్టించుకోలేదన్నారు. 1987-88లో నా భర్త ఆరుమెల్ల రామస్వామి పేరుమీద 2.18 ఎకరాలు అడంగల్ పహాణిలో ఎక్కినట్లు రికార్డులో చూపారని, అదేవిధంగా 1991-92లో 2.18 ఎకరాలు కాకుండ 1.18 ఎకరాలు నా పేరుమీద ఉన్నట్లు అడంగల్ పహాణిలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో చూపించారని అన్నారు. మా పేరుమీద పట్టా చేయాలని అడిగితే కాలయాపన చేశారే తప్ప పట్టా చేయడం లేదని, పాసుపుస్తకం ఇవ్వడం లేదని తెలిపారు.

పట్టించుకోని రెవెన్యూ అధికారులు
నారుమెల్ల రామస్వామి న్యాయం చేయాలని కలెక్టర్‌కు 2018 మార్చి 12, 2019 ఫిబ్రవరి 25న అర్జి పెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ బాధితులకు న్యాయం చేయాలని కలెక్టరేట్ నుంచి నం. డి/329/2019, ఫిబ్రవరి 20న ఆర్డీవోకు సిఫార్సు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...