2020 నాటికి పాలమూరు సాగునీరు


Wed,April 24, 2019 02:11 AM

-భవిష్యత్ తరాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుక
-పాలమూరు ఎత్తిపోతలతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం
-ఎంజీకేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు సాగునీరు
-ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
-ఎత్తిపోతల పథకాలపై రైతులకు వివరణ
కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : 2020 నాటికి పాలమూరు, రంగారెడ్డి పనులు పూర్తి చేసి ప్రాజెక్టు నుంచి పొ లాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. మంగళవారం కల్వకుర్తిలోని పార్టీ కార్యాలయంలో రైతులతో ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్ సమావేశమై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతున్న పనులను రైతులకు వివరించారు. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. శ్రీశైలం వెనుక జ లాలను ఎల్లూరు నుంచి లిఫ్ట్‌ల ద్వారా తోడి రిజర్వాయర్లు నింపి అక్కడ నుంచి సాగునీటికి ఏ విధంగా, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తారనే విషయాలను ఎమ్మెల్యే బ్లూప్రింట్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువును శాశ్వతంగా ప్రారదోలి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూ.35వేల కోట్లతో 12.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధం గా పాలమూరు-రంగారెడ్డి పనులకు శ్రీకారం చుట్టించారన్నారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు పాలమూరు, రం గారెడ్డిని అడ్డుకునేందుకు అన్ని కోర్టుల్లో దాదాపు 100వరకు కేసులు నమోదు చేశారని విమర్శించారు. కోర్టులు ప్రజ ల పక్షాణ నిలిచాయని, దీంతో పాలమూరు రంగారెడ్డి పనుల్లో వేగం పెరిగిందన్నారు. ఉమ్మడి పాలమూరులో పాలమూరు-రంగారెడ్డి ద్వారా 7.20లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అందులో కల్వకుర్తి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అం దుతున్న విషయాలను ఎమ్మెల్యే వివరించారు. కల్వకుర్తి మండలంలో 20,170ఎకరాలకు, వెల్దండలో 21,404 ఎకరాలకు, తలకొండపల్లిలో 25,705 ఎకరాలకు, ఆమనగల్లులో 15,049 ఎకరాలకు, కడ్తాలలో 3,201 ఎకరాలకు, మాడ్గులలో 10,862 ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఆయకట్టును స్థిరీకరించారని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ద్వా రా కల్వకుర్తి మండలంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అదే విధంగా డీ-82 ద్వారా మాడ్గుల వర కు 32వేల ఎకరాలకు సాగునీటిని ఈ వానాకాలంలో ఇస్తామని, అప్పర్ డిం డి ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

మొత్తంగా కల్వకుర్తి నియోజకవ్గంలో 2లక్షల ఎకరాలకు పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల 29వ ప్యాకే జీ, అప్పర్ డిండి ద్వారా ఇస్తామన్నా రు. కల్వకుర్తి ఎత్తిపోతల 29వ ప్యాకేజీ కింద మొత్తం 16 రిజర్వాయర్లు నిర్మించేందుకు రూ.4,100 కోట్లు మంజూరయ్యామని, అందులో కల్వకుర్తి నియోజకవర్గంలో 8 రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయనున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు పాలమూరు-రంగారెడ్డికి సంబంధించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌లోకి చేరుతుందన్నా రు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా తో పాటు, ఉమ్మడి పాలమూరు, న ల్గొండ జిల్లాలు కోనసీమగా మారడంతోపాటు రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టి, భావి తరాల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కే సీఆర్‌కు రైతులు అండగా నిలబడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికల అనంతరం ప్రతి మండలం నుంచి 50మంది రైతులను ఎంపిక చేసి ప్రాజెక్టుల సందర్శనకు తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, వైస్ ఎంపీపీ పర్వతాలు, వెంకటయ్య, బాల య్య, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...