నేటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు


Wed,April 24, 2019 02:11 AM

-పరీక్షల నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తి
-జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు
-హాజరుకానున్న 1,769మంది విద్యార్థులు
-డీఈవో గోవిందరాజులు
నాగర్‌కర్నూల్ రూరల్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓ పెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఓపెన్ ఇంటర్మీడియెట్‌లో 935మంది వి ద్యార్థులు, పదో తరగతిలో 834మంది వి ద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకో సం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చే యగా.. కల్వకుర్తిలో రెండు, ఒకటి పదో తరగతి, ఒక టి ఇంటర్మీడియెట్‌కు, అచ్చంపేటలో ఒకటి పదో తరగతి, ఒకటి ఇంటర్మీడియెట్‌కు, నాగర్‌కర్నూల్‌లో రెండు పరీక్షా కేంద్రాలు పదో తరగతికి, రెండు పరీక్షా కేంద్రాలు ఇంటర్మీడియెట్‌కు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 8మంది ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, 90మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసే విద్యార్థులు సమయానికంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు పరీక్షల విద్యార్థులకు చూచి రాతలను ప్రోత్సహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపెన్‌స్కూల్, ఇం టర్, పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఏమైనా సమస్యలు తలేత్తితే పూర్తి బాధ్యత ఛీప్ సూపరింటెండెంట్లపై ఉం టుందన్నారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించాలని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగరాజు, ప్రభుత్వ పరీక్షల నిర్వాహణాధికారి రాజశేఖర్‌లను ఆదేశించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...