అంకిత భావంతో పనిచేయాలి


Wed,April 24, 2019 02:10 AM

-సమర్థంగా విధులునిర్వహించాలి
-20 మూడువిడుతల్లో ఎన్నికలు
-కలెక్టర్ శ్రీధర్
-పరిషత్ ఎన్నికలపై అధికారులతో సమీక్ష
నాగర్‌కర్నూల్ రూరల్ : జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించనున్న పరిషత్ ఎన్నికల్లో అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో ఎన్నికల నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిషత్ ఎన్నికల్లో బాధ్యతగా పనిచేసి ఎన్నికల నిర్వాహణ సమర్ధవంతంగా చేయాలని సూచించారు. ప్రతి జెడ్పీటీసీకి ఒక్కో ఆర్వో లెక్క 20మంది ఆర్వోలను ప్రతి మూడు ఎంపీటీసీలకు ఒక ఏఆర్వోను, మొత్తం 190మంది ఆర్వో, ఏఆర్వోలను నియమించినట్లు వెల్లడించారు. వీరి శిక్షణ కూడా పూర్తయిందని, మొదటి విడత నామినేషన్ ప్రక్రియలో ఎన్నికల విధులు నిర్వహించనున్నారన్నారు. మిగతా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మండల స్థాయిలో త్వరలోనే శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని, జంబో, మినీ బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు సంబంధించి ప్రతి విడతా ఎన్నికల బ్యాలెట్ పేపర్ ముద్రణకు రెండు ప్రింటింగ్ కేంద్రాలను ఎంపిక చేయాలని, మొదటి విడత బ్యాలెట్ పత్రాల ఎంపికకు ఆర్డీవో హనుమానాయక్, రెండో విడత ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌కుమార్, మూడో విడత ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ అచ్చంపేట ఆర్డీవో పాండునాయక్ ఆధ్వర్యంలో ముద్రణ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నమోదు, పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు.

జిల్లాలోని 20మండలాల్లో మూడు విడతలుగా నిర్వహించే ఎంపీటీసీ, జె డ్పీటీసీ ఎన్నికలు 6వ తేదీ మొదటి విడ త నిర్వహించే ఎన్నికలకు ఏడు మండలాల్లో ఏడు జెడ్పీటీసీ స్థానాలకు, 91ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సంసిద్దంగా ఉండాలని, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. జాగ్రత్తగా ఎన్నికల విధులు నిర్వహించాలని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 6వ తేదీన మొదటి విడతలో ఏడు జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీలను, మే 10వ తేదీన రెండో విడతలో ఐదు జెడ్పీటీసీ, 52 ఎంపీటీసీలకు, అదేవిధంగా మే 14న మూడో విడతలో 8 జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈ వో మొగులప్ప, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూధన్‌నాయక్, బైరెడ్డి సిం గారెడ్డి, డాక్టర్.అంజిలప్ప, గోవిందరాజులు, మోహన్‌రెడ్డి, అనిల్‌ప్రకాష్, చంద్రశేఖర్, సాయిసుమన్, ఎర్రిస్వా మి, ఆర్డీవోలు హనుమానాయక్, రాజేష్‌కుమార్, పాండునాయక్ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...