ప్రాణం తీసిన ఆస్తి పంపకం!


Wed,April 24, 2019 02:09 AM

-అన్నను చంపిన తమ్ముడు
-ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందంటూ కక్ష
-అదును చూసి హత్య
-ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సృజన
ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : అమరచింత మండలం కొంకనివాని పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంతో సొంత అన్నను తమ్ముడే హతమార్చాడు. మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి అమరచింత ఎస్‌ఐ రామస్వామి తెలిపిన వివరాల మేరకు..కొంకనివానిపల్లి గ్రామానికి చెందిన గొల్ల చంద్రన్న, దేవమ్మలకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు పెద్దరాజు, చిన్న కుమారుడు చిన్నరాజు ఇద్దరికి వివాహాలు చేశారు. రెండ్నెళ్ల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరు అన్నదమ్ములకు గ్రామ పెద్దలు ఆస్తి పంపకాలు చేశారు. కానీ ఉమ్మడిగానే ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ తమ్ముడు చిన్నరాజు రెండేళ్లుగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అదే మనసులో పెట్టుకున్న చిన్నరాజు మంగళవారం ఇంట్లో నిద్రపోతున్న అన్నపై ఒక్కసారిగా దాడి చేశాడు. రోకలి బండతో తలపై మోది హత్య చేశాడు. పెద్దరాజు తల పగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుంటుబ సభ్యులు వారిస్తున్నా ఎంతకీ వినకుండా దాడి చేసిన చిన్నరాజు హత్య చేసిన వెంటనే పరారయ్యాడు. మృతుడు పెద్ద రాజుకు భార్య మంజుల ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నరాజు భార్య గర్భవతి. వీరు ఉమ్మడి కుటుంబంగానే జీవనం సాగి స్తుండగా ఈ ఘటన కుటుంబంలో కలకలం రేపింది. సమాచార మందు కున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పూర్వాపరాలు తెలుసు కున్నారు. డీఎస్పీ సృజన, ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వర్‌రావులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...