విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి


Tue,April 23, 2019 12:35 AM

- జిల్లా స్పెషల్ కలెక్టర్ క్రాంతి
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : విద్యార్థులు చదువులో క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని మహబూబ్‌నగర్ జిల్లా స్పెషల్ కలెక్టర్ వి.క్రాంతి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతివన్ రెసిడెన్షియల్ పాఠశాల మొదటి వార్షికోత్సవం ఏనుగొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పెషల్ కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు, అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తూ వారి బాగోగులను చూస్తూ వారికి కావలసిన విద్యను అందించి వారికి చేయూతనివ్వడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి చిన్నారులను ప్రోత్సహిస్తూ వారు తమంతట తాముగా జీవించడానికి తోడ్పాటు ఇచ్చినట్లు ఉంటుందన్నారు. దీని నిర్వహణలో నిరంతరంగా పర్యవేక్షిస్తున్న ఏ.నటరాజ్‌ను చైర్మన్ రెడ్‌క్రాస్ సభ్యులను అభినందించారు. విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలలో వినూత్న మార్పులు వచ్చాయని వారిని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రిన్సిపాల్, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో శంకర్ పౌండేషన్ హైదరాబాద్‌కు చెందిన డి.శ్రీదేవి మాట్లాడుతూ కలెక్టర్ డి. రోనాల్డ్‌రోస్ ఈ పాఠశాలకు తాము ముఖ్య సలహాదారుగా ఉండడమంటే తమ సలహాలు, సహకారాలు అందిస్తున్నానన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ మొదటి చైర్మన్ వి.మనోహార్‌రెడ్డి కార్పొరేటర్ కె.వనజ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆట పోటీలు చిత్రలేఖనం, రాత పోటీలు, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్. జగపతిరావు, ట్రైనర్ రమణ, డా. ప్రతిభ, డా. విష్ణుజనార్దన్, ఈశ్వర్, నాగేంద్రస్వామి, జూనియర్ రెడ్‌క్రాస్ ఇన్‌చార్జి బాలలింగయ్య, పెంటయ్యగౌడ్, సూపరింటెండెంట్ మణిమాల, శాంతివన్, అర్ఫన్‌హోం ఇన్‌చార్జి వరలక్ష్మీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...