అకాల వర్షంతో 132 ఎకరాల పంటనష్టం


Tue,April 23, 2019 12:35 AM

- రైతులు దళారీలను నమ్మోద్దు..
- జిల్లాలో 367 మందే లైసెన్స్ విత్తన వ్యాపారులు
- జిల్లా వ్యవసాయశాఖ అధికారి సింగారెడ్డి

అమ్రాబాద్ రూరల్ : జిల్లాలో అకాల వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 132 ఎకరాల్లో పంటనష్టం వాటిళ్లిందని, అందుకు సంబంధించిన మండల అధికారులు నివేదికలు తయారు చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి సింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలో గల అటవీశాఖ విశ్రాంతి భవనం వద్ద విలేకరులతో మాట్లాడుతూ నివేదికను ప్రభుత్వానికి అందించి బాధిత రైతులకు నష్ట పరిహారం వచ్చేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఏ మండలాల్లో ఎలాంటి పంటలు వేయాడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారో దానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అందుకు తగ్గట్టుగానే రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మండలంలో సీఐ, డీఐవో, ఏవో స్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పర్చామని, వీరు ప్రతి గ్రామంలో పర్యటించి నకిలీ మందులు, ఎరువులు అమ్ముతున్న వ్యక్తులపై చర్యలు చేపట్టెలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు..జిల్లాలో మొత్తం 367 మంది లైసన్స్ కలిగిన డీలర్లు ఉన్నారని, వీరి వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదును భద్రపర్చుకోవాలన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...