క్రైస్తవుల సంక్షేమానికి..ప్రభుత్వం కృషి


Mon,April 22, 2019 02:12 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : క్రైస్తవుల సం క్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కల్వరికొండపై ఆదివారం నిర్వహించిన ఈస్టర్ సన్ రైజ్ సండే కార్యక్రమానికి మంత్రి హా జరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులనుద్దేశించి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జి ల్లా కేంద్రంలో రూ.కోటితో క్రిష్టియన్ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. క్రైస్తవులకు శ్మశాన వాటిక కూడా లేని రోజులను చూశామ ని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా కేంద్రం లో శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించామని గుర్తు చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి ఇప్పటికే ఎకరా స్థలాన్ని చూశామని, ఆ స్థలం పట్టణానికి దూరంగా ఉందని, పట్టణ సమీపంలోనే క్రిస్టియన్ భవన్ ఉండేలా స్థలాన్ని అన్వేషిస్తున్నామని చెప్పారు. అన్నివర్గాలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. న్యాయం కోసం పోరాటం చేసిన వారు చరిత్రలో చిరంజీవులుగా మిగిలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. ఈ సందర్భం గా క్రైస్తవ స్త్రీ సమాజం ప్రదర్శించిన యేసుక్రీస్తు పునరుత్థాన ఇతివృత్తం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎంబీసీ చర్చి ఫాదర్ వరప్రసాద్, ఎంబీసీ చ ర్చి కౌన్సిల్ సభ్యులు ప్రతాప్‌కుమార్, పురుషోత్తం, జే ఏ డేవిడ్, అండ్రూస్, నతనియాల్, శ్యామూల్, స్వదేశ్‌కుమార్, ప్రవీణ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...