వడదెబ్బకు చెక్ పెట్టండిలా..


Mon,April 22, 2019 02:12 AM

ఆత్మకూర్, నమస్తే తెలంగాణ: భానుడి తీవ్రతకు రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయంటారు పెద్దలు, మే చివరిలో వచ్చే ఆ కార్తె సంగతి పక్కనబెడితే ఏప్రిల్ మొదటి వారంలోనే బండలు పగిలేలా ఎండలు మండుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే భానుడు తన పదునైన కిరణాలతో సుర్రుమనిపిస్తున్నాడు. 10 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు రోడ్డుపై వెళ్లాలంటే జనం వడగాడ్పుల ధాటికి భయపడుతున్నారు. పెండ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ పనులపై బయటకు వస్తున్నా.. తిరిగి ఇంటికి వెళ్లేసరికి వడదెబ్బకు గురై దవాఖానల పాలవుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హీట్ స్ట్రోక్ (వడదెబ్బ), హీట్ సింకోప్ (తల తిరగడం), హీట్ ఎక్సాషన్ (అలసట), హీట్ క్రాంప్స్ (కండరాలు, పిక్కలు లాగడం)తో పాటు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...