కుటుంబ కలహాలతో యువకుడి దారుణహత్య


Mon,April 22, 2019 02:12 AM

మద్దూరు: కుటుంబ కలహాలు, ఆస్తి తగదాలతో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన మండలంలోని గోకుల్ నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గోకుల్‌నగర్ గ్రామానికి చెందిన కొత్త అంజిలయ్య (29)కు కుటుంబ సభ్యులకు మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకునేవి. హైదరాబాద్‌కు వలస వెళ్లిన అంజి లయ్య బావోజీ జాతర కోసం గ్రామానికి వచ్చాడు. కుటుంబంలో పెద్దవాడైన అంజిలయ్య ఆస్తిలో తనవాటా ఇవ్వాలని తల్లి, సోద రి, ఇద్దరు తమ్ముళ్లతో గొడవపడ్డాడు. దీంతో అర్ధరాత్రి అంజిలయ్య తల్లి తిర్మలమ్మ, సోదరి అంజిలమ్మ, సోద రులు రాజు, రమేష్‌లు మద్యం తాగి నిద్రపోయిన అంజిలయ్య కళ్లలో కారంపొడి చల్లి, క ట్టెలు, రాళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ విషయమై సమా చారం అందుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచనామా అనంతరం పోస్టు మార్టం నిమిత్తం అంజిలయ్య మృతదేహాన్ని నారాయణపేట దవాఖానకు తర లించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...