జీపు ఢీకొని వ్యక్తి మృతి


Mon,April 22, 2019 02:11 AM

పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని కల్వకోల్ సమీపంలో బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాతా పూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు(32) కొల్లాపూర్ నుంచి బైక్‌పై సాతాపూర్ గ్రామానికి వస్తుండగా పాలమూరు రంగా రెడ్డి పనులు చేస్తున్న ఆర్.కె కంపెనీకి చెందిన (బొలేరో)జీపు పెద్ద కొత్తపల్లి నుంచి కొల్లాపూర్ వెళ్తుండగా కల్వకోల్ సమీపంలో బైక్‌ను ఢీకొట్టడంతో రాములు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపు తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...