పరిషత్ ఎన్నికల్లో గెలుపు ఖాయంn పార్టీ విధేయులకు తగిన గుర్తింపు


Sun,April 21, 2019 12:47 AM

- సీఎంచే బీ ఫారాలు
- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
- కార్యకర్తలందరికీ న్యాయం ఎమ్మెల్సీ కూచకుళ్ల

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో శనివారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గస్థాయి పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఇందు లో రాబోయే పరిషత్ ఎన్నికలపై ఐదు మండలాలకు చెందిన సర్పంచ్‌లతో సహా పలువురు ప్రజాప్రతినిధులతో ఎ మ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. స ర్పంచ్ ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయన్నారు. దీంతో ప్రజల మద్దతు ఉన్న గెలిచే అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ద్వారా అభ్యర్థులకు బీ ఫారాలు అందుతాయన్నారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో వినూత్న అభివృద్ధి కా ర్యక్రమాలు జరగబోతున్నాయన్నారు. దీంట్లో పరిషత్ సభ్యుల పాత్ర కూడా ప్రముఖంగా ఉంటుందన్నారు. ఈ దిశ గా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందన్నా రు. పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. గతం లో మార్కెట్ చైర్మన్‌గా సామాన్యుడైన వెంకటయ్యను నియమించడం పార్టీ కార్యకర్తలంతా గుర్తుంచుకోవాలని సూ చించారు. ఇంకా ఐదేళ్లు ఉన్నందున పార్టీకి పనిచేసిన కార్యకర్తలందరికీ త ప్పకుండా పలు పదవులు వస్తాయని, ఎవ్వరూ నిరాశ చెందవద్దన్నారు.

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు నా అండ, సహకారం ఉంటుందన్నారు. పార్టీ గీ టు దాటిన వ్యక్తులు ఎంతటి నాయకులైనా తాను సహించనన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లి గెలిచి వస్తామని ఎవ్వరైనా వెళ్తే తిరిగి తీసుకోబోమన్న సంగతి గుర్తించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిలో సర్పంచ్‌లు సహా త్వరలో జరగబోయే పరిషత్ ప్రజాప్రతినిధులంతా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎ మ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఎంతో గౌరవప్రదమైనవన్నారు. సేవ చే సేందుకు పదవులు ఎంతో సహకారం అవుతాయని, టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ ఎమ్మెల్యే మర్రి సహకారంతో రాబోయే కాలంలో మంచి పదవులు లభిస్తాయన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీ నివాస్‌యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే మర్రి చేస్తున్న అభివృద్ధిలో పార్టీ ప్రతినిధులు ముందుకు సాగాలన్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ అభివృద్ధికి చిరునామాగా మారుతుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలి చే నాయకులు ప్రజలకు సేవకులుగా బాధ్యతతో పనిచేయాలన్నారు.

రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 71ఎంపీటీసీ, ఐదు జెడ్పీటీసీ స్థానాలను గెలిచేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న వివాదాలు ఉన్నా మర్చిపోవాలన్నారు. పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎవ్వరికైనా ఎలాం టి ఇబ్బందులు కలిగినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యకర్తలకు అండదండలుగా ఉండి తగిన న్యాయం చేసి తీరుతామన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...