ప్రపంచ మేధావి అంబేద్కర్‌


Sun,April 21, 2019 12:44 AM

మూసాపేట : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యంత మేధాశక్తి కల్గిన మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రిశ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మూసాపే ట మండలం పోల్కంపల్లి గ్రామంలో అంబేద్కర్ యు వజన సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలి సి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అవిష్కరించారు. ముందుగా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచంలోనీ చాలా దేశాలకు రాజ్యాంగా న్ని ఆ దేశ స్థితిగతులకు సరిపోయేలా రచించారని, అం దుకే ఆయనకు ప్రపంచ మేధావిగా గుర్తింపు వచ్చిందన్నారు. మన దేశంలోని పేద, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిని అభివృద్ధి చెయాలని రా జ్యాంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు.

1956 భారత దేశం ఆర్థికంగా ఎదగాలంటే మహిళలకు పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానత్వం కల్పించాలని రాశారని, కానీ అప్పటి కొంత మంది స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం అమలు చేయలేదని, అందుకే ఆయన కేంద్ర లా మంత్రి పదవిని తృణప్రయంగా వదిలివేశారని గుర్తు చేశారు. ఆయన రాసిన రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపర్చకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన వారందరిపై దేశ ద్రోహం కేసు కింద జైల్లో పెట్టె అవకాశం ఉండేదని మంత్రి అన్నారు. వాటితోపాటు ఆయన ఆర్‌బీఐనీ, కార్మిక చట్టాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారని చెప్పారు. అంబేద్కర్ ఆశ యం మేరకు పేదలు ఆర్ధికంగా ఎదగాలని సూచించా రు. పోల్కంపల్లి గ్రామానికి డబుల్ బెడ్రూంలు మం జురు చేయడంతోపాటు, చెరువులను నింపి, ఆ చెరువు కట్టపైనే అందరితో పాటు కలిసి భోజనాలు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...