ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు.. ప్రత్యేక క్యాంపు


Sun,April 21, 2019 12:43 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీ సుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యా అ దనపు సంచాలకులు శ్రీహరి ఆదేశించారు. శనివారం జిల్లా అధికారులతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కేజీబీవీ ఇంటర్ మొదటి సంవత్సరంలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న 256మంది విద్యార్థులకు గానూ 138మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 118మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని, వీరికోసం ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ ఇవ్వాలని ప్రత్యేకాధికారులు, విద్యా శాఖాధికారులను ఆదేశించారు. కేజీబీవీలో రెసిడెన్షియల్ బోధన ప్రక్రియ నిర్వహిస్తున్నప్పటికీ ఎందుకు ఉత్తీర్ణత సాధించలేక పోయారని ప్రశ్నించారు. విద్యార్థుల సామార్థ్యాలను ముందుగానే గుర్తించి అందుకనుగుణంగా బోధన ప్రక్రియ ఎందుకు నిర్వహించడం లేదని సంబంధిత ప్రత్యేకాధికారులు, పీజీసీఆర్‌టీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేజీబీవీలో తెలంగాణ ప్రభుత్వం బాలికల అభ్యున్నతికి కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, అమ్మాయిలకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు కేజీబీవీల ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఇంటర్మీడియెట్‌లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించిన బల్మూరు కేజీబీవీ ప్రత్యేకాధికారిని అభినందించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలైన 118 మందికి సోమవారం నుంచి తాడూరు కస్తూర్బా విద్యాలయంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఆయా సబ్జెక్టుల్లో ఫేయిలైన వారికి నిష్నాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామని డీఈవో గోవిందరాజులు వివరించారు. వీసీలో సెక్టోరల్ అధికారి ఆహ్మద్, నోడల్ అధికారి కుర్మయ్య, ప్రత్యేకాధికారులు, పీజీసీఆర్‌టీలు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...