ఘనంగా హనుమాన్ జయంతి


Sat,April 20, 2019 12:37 AM

నాగర్‌కర్నూల్ రూరల్: శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ పంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హనుమాన్ శోభా యాత్ర నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సీతారామ లక్ష్మణులు, హనుమంతుల విగ్రహాలను ఉంచి పట్టణంలోని హానుమాన్ దేవాలయంల నుంచి పట్టణ పుర వీధుల గుండా ఈశోభా యాత్ర కొనసాగింది.

భక్తి భావాలను అలవర్చుకోవాలి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్: ప్రతి ఒక్కరూ భక్తి భావాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించడాన్ని కొనియాడుతూ హనుమాన్ గొప్పతనాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసీరాం, జయరాంనాయక్ (స్వామి), వెంకటేష్, ఆంజ నేయులు, శ్రీను, మనోహర్, బాలాజీ, పర్వతాలు, బాల్‌రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...