నేడే.. మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష


Sat,April 20, 2019 12:37 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : మైనార్టీ గురుకులాల్లో ఐదవ తరగతిలో ప్రవేశం కోసం బాల, బాలికలకు శనివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. జిల్లాలోని నాలుగు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్ బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 520 మంది బాలురు, కల్వకుర్తి, కొల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలల్లో 450 మంది బాలికలు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో, కల్వకుర్తి బాలికల గురుకుల పాఠశాలలో, కొల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాల, అచ్చంపేట బాలుర గురుకుల పాఠశాలలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షకు హజరయ్యేటప్పుడు తప్పకుండా తమ హాల్ టికెట్లు తీసుకురావాలన్నారు. పరీక్ష హాల్‌కు గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. వేసవిని దఋష్టిలో ఉంచుకుని తాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు రాసేందుకు వచ్చే ప్రతి విద్యార్థి వెంబడి వారి తల్లితండ్రులు గానీ, సంరక్షకులు గానీ తప్పకుండా రావాలని కోరారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...