ముగిసిన బ్రహ్మోత్సవాలు


Sat,April 20, 2019 12:37 AM

చారకొండ : మండలంలోని శిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిసాయి. అపర భద్రాది పేరుగాంచిన శిర్సనగండ్ల శ్రీ సీతారాచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభమై వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో హజరై శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లను దర్శించుకుని తీర్థప్రసాదములను స్వీకరించారు. కల్యాణోత్సవం, పెద్ద రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చినా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. చివరి రోజు శ్రీ సీతారామచంద్ర స్వాములకు అభిషేకం, శివదత్తాత్రేయపరుశరామ, పోచమ్మ దేవాలయల్లో ప్రత్యేక అర్చనాదులు, నామ సంకీర్తనలతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు తాగునీటి సమస్య లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అపశ్రుతులు జరగకుండా బ్రహ్మోత్సవాలు ముగియడంతో నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఢేరం మల్లిఖార్జునశర్మ, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్ నిరంజన్, సర్పంచ్‌లు యాతం శారదశ్రీను, గుండె విజేందర్‌గౌడ్, ప్రశాంత్‌నాయక్, నరేందర్‌రెడ్డి, శ్రీను, సుజాత, ఎంపీటీసీ నర్సింహ్మరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గురువయ్యగౌడ్, నాయకులు మోహన్‌రెడ్డి, రామకృష్ణ, నారాయణరెడ్డి, ఆలయ అర్చకులు సీతారామశర్మ, మురళిశర్మ, లక్ష్మణశర్మ, రాముశర్మ, వేణుగోపాల్‌శర్మ, ప్రవీణ్‌శర్మ తదితరులు పాల్గోన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...