స్ట్రాంగ్‌రూం కోసం కళాశాల పరిశీలన


Sat,April 20, 2019 12:36 AM

బిజినేపల్లి : ఎంపీటీసీ ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు మండలంలోని పాలెం గ్రమంలో గల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జేసీ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కళాశాలలో ఉంచేందుకు అనువుగా ఉన్నాయా లేదా అని పరిశీలించినట్లు తెలిపారు. అంతేకాకుండా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంకు పూర్తి స్థాయి వసతులు ఇక్కడ ఉన్నాయా, లేవా అని ఆరా తీశారు. కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్‌రూంలను ఏర్పాటు చేసేందుకు గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో మొగులప్ప, ఎంపీడీవో హరనాథ్ ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...