దళారీ వ్యవస్థ నిర్మూలనకు కృషి


Fri,April 19, 2019 03:35 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : రైతులు పండిస్తున్న మామిడి కాయలను మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కొనుగోలుచేస్తూ దళారీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ పేదరిక నిర్మూలనా సంస్థ చీఫ్ ఎగ్చిక్యూటివ్ అధికారి పాషుమిబసు వె ల్లడించారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మా చి నేనిపల్లిలో బతుకమ్మ మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం మామిడికాయల కొనుగోలుపై మహిళలకు నిర్వహించిన అవగాహన సదస్సు లో ఆమె మాట్లాడారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రభుత్వం చొరవతో సెర్ఫ్ సహకారంతో గ్రామాల్లోని మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సం ఘాలను ఏర్పాటుచేసుకొని తద్వారా మామిడికాయలను రైతుల నుంచి నిర్ణయించిన ధరల ప్రకారంగా కొనుగోలు చేసుకుని నాణ్యతా ప్రమాణాలతోకూడిన మామిడిధరకు కంపెనీలకు నేరుగా విక్రయించుకొని తద్వారా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. కాయలు కోసేటప్పుడు దెబ్బతినకుండా కాయలను గ్రేడింగ్‌చేసి ప్రత్యేకపెట్టెలలోపెట్టి తగిన జాగ్రత్తలతో కంపెనీలకు ఎగుమతి చేసుకోవచ్చన్నారు. మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఇప్పటికే 75శాతంకాయలు ఎగుమతి అయ్యాయని కేవలం 25శాతం మాత్రమే కాయలు కోయలేదన్నారు. మామిడికాయల కోతపై మీరు తీసుకున్న శిక్షణ ఏమేరకు ప్రయోజనం చేకూరిందని సీఈఓ అడిగితెలుసుకున్నారు.

ఈ నెల 23న హైదరాబాద్‌లో మామిడికాయలను కొనుగోలుచేసే కంపెనీలతో మామిడికాయలు ఏధరకు ఎన్నిటన్నులు కాయలు విక్రయిస్తారన్నది మీరు ఖరారు చేసుకోవాల్సిఉంటుందని ఈలోగా మీ సంఘం ద్వారా ఎన్ని టన్నుల మామిడికాయలు విక్రయిస్తారో అందుకు సిద్ధంగా రావాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఎకరా మామిడితోటకు రెండు సంవత్సరాలకు లక్ష రూపాయల చొప్పున లీజుకు దళారీ వ్యాపారులకు ఇస్తామని దీంతో తాము మామిడితోటలపై నష్టపోతున్నట్లు మ హిళా సంఘాల సభ్యులు సీఈఓకు వివరించారు. అందుకు సీఈవో స్పందిస్తూ మీరు స్వంతంగా కాయలు తీసుకువెళ్లి హైదరాబాద్‌లో అమ్ముకొచ్చారా? అని ప్రశ్నించారు. ఎకరాకు ఎన్న మ మామిడిచెట్టుంటాయని సీఈఓ జిల్లా ఉద్యానవన అధికారి చంద్రశేఖర్‌రావును అడుగగా సరైన గణాంకలను చెప్పలేక నీళ్లు నమలడంతో అసహనం వ్యక్తం చేశారు. గ్రామాధ్యక్షురాలు అలివేలను ఉద్ధేశించి మాట్లాడుతూ మీరు తీసుకున్న మామిడికాయల కోతపై శిక్షణ ఏమేరకు ఉపయోగపడిందో ఆమె అడిగితెలుసుకున్నారు. కాయలు కోయడం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ సుధాకర్ మాట్లాడుతూ లీజుకు ఇవ్వని మామిడిరైతులతో మాట్లాడి గ్రేడింగ్ ప్రకారంగా కాయలు విక్రయించి లాభాలు చూడవచ్చని మహిళా సంఘాలకు సూచించారు. అసిస్టెంట్ డీఆర్‌డీఏ పీడీ జంగరెడ్డి మాట్లాడుతూ రైతుల ఉత్పత్తిదారుల సంఘం, సమైక్య ద్వారా వచ్చే ఏడాదినుండైనా వ్యాపార దృక్ఫథంతో ముందడుగు వేయడానికి వీలుంటుందన్నారు. రైతులకు లాభాలు రావాలని, అధునాతన పద్ధతులతో మామిడి తోటలు ఎదుగుతూ అధిక దిగుబడులు ఇచ్చే విధంగా ముందడుగు వేయాలని సూచించారు. అంతకుముందు పాషుమీబసుకు గ్రామ మహిళా సంఘం సభ్యులు పూలబోకేలతో స్వాగతం పలికారు. అక్కడ ప్రదర్శనకోసం ఉంచిన బేనిషాన్‌కాయలను పరిశీలించారు.ఈ సదస్సులో ఉద్యానవన శాస్త్రవేత్త భగవాన్, ఎండీఓ కృష్ణయ్య, వెలుగు ఏపీఎం గౌసు, సీసీలు బ్రహ్మం శేఖర్, డీపీఎంలు సుధాకర్, అరుణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...