పరిషత్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి


Fri,April 19, 2019 03:35 AM

- ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, నమస్తే తెలంగాణ: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గులాబీ జెండా ఎగరాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే నివాస గృహంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలు, గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల అభ్యర్థుల ఎంపిక కోసం నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పరిషత్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి పేర్లను ఆరా తీశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారిచే వెర్వేరుగా సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీ, ప్రజల కోసం నిస్వార్థంగా సేవలు అందించే వారికే ఎన్నికలలో అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకునే విధంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మరోసారి పరిషత్ ఎన్నికలలో అచ్చంపేట సత్తా చాటాలని కోరారు. ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీని అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు.

ఈ ఎన్నికల్లో కూడా అన్ని మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు మొత్తం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు లభించడం లేదని, అక్కడక్కడ ఉన్న వాళ్లు ఎలాగూ ఓడిపోతామని పోటీకి ముందుకు రావడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో అభ్యర్థులు పోటి పడుతున్నారని కాని కాంగ్రెస్ పార్టీ పిలిచి సీటు ఇస్తామని చెప్పిన వెళ్లే వాళ్లు లేరన్నారు. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు వచ్చిన గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమన్నారు. పరిషత్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులనే అందరి అభిప్రాయలు తీసుకోని ఎంపిక చేస్తున్నామని అన్నారు. లింగాల, అచ్చంపేట, వంగూరు, చారకొండ, బల్మూర్, అమ్రాబాద్, పదర మండలంలోని వివిధ గ్రామాలలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, అభ్యర్థి పనితీరు తదితర అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే అభ్యర్థిని ఖరారు చేస్తున్నామని అన్నారు. సమావేశంలో జిల్లా రైతు సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహ్మగౌడ్, మండల రైతు సమితి అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తులసీరాం, లింగాల మాజీ ఎంపీపీ మాకం తిర్పతయ్య, కేటి తిర్పతయ్య, చెన్నకేశవులు, కోనేటి తిర్పతయ్య, ఎంపీపీ పర్వతాలు, కర్ణాకర్‌రావు, చుక్కారెడ్డి, షబ్బీర్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...