రెండో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి


Fri,April 19, 2019 03:34 AM

వనపర్తి రూరల్ : రెండో తరగతి విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరంలో చోటుచేసుకుంది. పాఠశాల కరస్పాండెంట్ కొట్ట్టడం వల్లే తమ కొడుకు మృతి చెందాడని ఆరోపిస్తు పాఠశాల ముందు విద్యార్థి తల్లిదండ్రులు, బం ధువులు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కోడేరు మండలం సింగాయిపల్లి పరిధిలోని వాల్యనాయక్ తండాకు చెందిన హన్మంతు, లక్ష్మిల కుమారుడు వంశీ నాగవరం పీఎస్ సింధూజ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న కరస్పాండెంట్ కొట్టడంతో వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయమై ఈనెల4న తల్లిదండ్రులకు సమాచారం అందించాడని, వారు అబ్బాయిని వనపర్తి, మహబుబ్‌నగర్‌లో చికిత్స చేయించినా తగ్గక పోవటంతో హైదరబాద్ తరలించి వైద్యం చేయిస్తున్న తరుణంలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు.

పాఠశాల ఎదుట ఆందోళన
దీంతో వంశీ మృతదేహంతో అతని తల్లిదండ్రులు, బంధువులు నేరుగా పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. కరస్పాండెంట్ కొట్టడం వల్లే తమకొడుకు మృతి చెందాడని, కరస్పాండెంట్‌ను వెంటనే శిక్షించి, తమకు న్యాయం చేయాలని మృతదేహాన్ని పాఠశాల గేటు ముందు ఉంచి బాధితులు ధర్నా నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం సీఐ సూర్యనాయక్ పరిస్థితిని సమీక్షించారు. వంశీ కుటుంబానికి మద్దతుగా గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపై ధర్నాకు దిగారు.

పాఠశాలను సీజ్ చేసిన అధికారులు..
విద్యార్థి మృతి ఘటనపై స్పందించిన తహసీల్దార్ శాంతిలాల్, జిల్లా విద్యాశాఖ పరీక్షల నిర్వహణాధికారి మధూకర్, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాఠశాలలో కోచింగ్ తీసుకుంటున్న మిగతా విద్యార్థులను ఆ ప్రదేశం నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు. అనంతరం గేటుకు సీలు వేసి, పాఠశాలను సీజ్ చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
నాగవరం పీఎస్ సింధూజ పాఠశాలలో జరిగిన సంఘటనను తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అక్కడికి చెరుకుని బాధిత కుటుంబానికి న్యా యం జరిగేలా చూస్తామని, వారికి మనోధైర్యాన్నిచ్చారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...