హరహర మహాదేవా


Thu,April 18, 2019 12:26 AM

- సలేశ్వరానికి కదిలిన భక్తజనం
- లింగమయ్య నామస్మరణతో మార్మోగిన నల్లమల
- కిక్కిరిసిన గుండం
- వైభవంగా ప్రారంభమైన సలేశ్వరం జాతర
- రాష్ట్రంతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తుల రాక

అమ్రాబాద్ రూరల్ : హరహరమహాదేవ..శంభోశంకర అంటూ నల్లమల మార్మోగింది. వస్తున్నాం లింగమయ్య అంటూ సలేశ్వరం దారులన్నీ భక్తజనంతో నిండిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని లింగాల మండలంలోని సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామునుంచే భక్తులు సలేశ్వర సాహస యాత్రను ప్రారంభించారు. అటవీ శాఖ అధికారులు కొంత పట్టు విడుపులతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బుధవారం నుంచి అనుమతి ఇస్తు కొంత ఊరటనిచ్చారు. నల్లమల అందాలను తిలకిస్తూ.. కొండ గుట్టలను దిగుతున్న శివయ్య భక్తులు హర హర..మహాదేశా.. శంభోశంకర అంటూ సలేశ్వరం వద్ద వెలసిన లింగమయ్యను దర్శించుకున్నారు. తొలిరోజు సుమారు 30 వేల మంది భక్తులు లింగమయ్యను దర్శించుకున్నారు.

మూడు కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కుతూ.. దిగుతూ సలేశ్వరం చేరుకున్న భక్తులకు 280 అడుగుల నుంచి జాలువారుతున్న జలపాతాన్ని తాకిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. పవిత్ర గుండంలో పుణ్య స్నానాలు చేస్తే కాలి నడకతో వచ్చిన ఆయాసం పోతుందన్న భక్తుల విశ్వాసంతో గుండం వద్ద రద్దీ కనిపించింది. జాతరకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలుగకుండ పోలీసులు రాంపూర్ పెంట, పుల్లాయిపల్లి, అన్నదానం జరిగే ప్రదేశం, లింగమయ్యను దర్శించుకునే ప్రదేశంలో భద్రత ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. వీరితో పాటు ఐటీడీఏ ఉపాధిహామి ఎస్‌వో జయరాజు, చెంచు మహిళా సమాఖ్య ఏపీడీ లక్ష్మయ్య, టెక్నికల్ ఇంజినీర్ శ్రీనువాసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...