ఆన్‌లైన్‌లో ఆగంజేసిండ్రు


Thu,April 18, 2019 12:25 AM

జోగుళాంబ గద్వాల నమస్తేతెలంగాణ ప్రతినిధి : జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండ లం కొండపురం గ్రామానికి చెందిన వల్లూరి రంగస్వామికి (55 చనిపోయారు) గ్రామ శివారులో సర్వేనెంబర్ 90/1, పట్టా నెంబర్ 294లో 10 ఎకరాల 15 గుంటల పట్టాభూమి ఉంది. రంగస్వామి చనిపోయిన తర్వాత వారసులకు పంపకాల్లో భాగంగా ఆయన మూడో కుమారుడు వల్లూరు కృష్ణ కు ఆ భూమి వారసత్వంగా వచ్చిం ది. తన తండ్రి భూమి ని విరాసత్ చే యించుకునేందుకు కృష్ణ త హసీల్దారు కార్యాలయం లో విరాసత్‌కు దరఖాస్తు చేస్తుకున్నారు. వివరాలు పరిశీలించిన తహసీల్దారు కార్యాలయ సిబ్బంది సర్వే నెంబర్ 90/1, పట్టా నెంబర్ 294లోని 10 ఎకరాల 15 గుంటల భూమి నారం రంగన్న పేరుపై ఉందని అధికారులు సమాచారమిచ్చారు. దీంతో ఆందోళనకు గురైన వల్లూరు కృష్ణ అసలు విషయం పై ఆరా తీయగా తమ తండ్రి పేరుపై ఉన్న భూమిని తమ పక్క భూయజమానైన నారం రంగన్న పేరుపై, నారం రంగన్న పేరుపై ఉన్న సర్వే నంబర్ 90/2 పట్టానంబర్ 716లో ఉన్న 3 ఎకరాల భూమి తన తండ్రి వల్లూరు రంగస్వామి పేరుపై ఆన్‌లైన్‌లో నమోదైందని గుర్తించారు. వల్లూరు రంగస్వామికి ఉన్న 10 ఎకరాల 15 గుంటల భూమిని నారం రంగన్న పేరుపై, నారం రంగన్న పేరుపై ఉన్న 3ఎకరాల భూమిని రంగస్వామి పేరుపై ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేశారని అధికారులకు వివరించారు.

ఈ భూములను ఆన్‌లైన్‌లో సరిచేసి తమ భూ ములు తమ పేరుపైకి మార్చండని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వల్లూరు రంగస్వామి, నారం రంగన్న ఇద్దరూ మరణిచండంతో వారి వారసులు వల్లూరు కృష్ణ, నారం రంగస్వామిలు తమకు భూమిని విరాసత్ చేయించాలని పలు ప్రతా లు అందజేస్తున్నారు. గత ఏడాదిన్నర నుంచి ప్రజావాణిలో ఒకసారి ఫిర్యాదు చేసి తహసీల్దారు కార్యాలయానికి ప్రతి సోమవారం వెళ్లి అధికారులతో మొరపెట్టుకుంటున్నారు. వెళ్లిన ప్రతీసారి ఏదో ఒక కారణం చెబు తూ అధికారులు పని చేయకుండా తప్పించుకుం టూ వచ్చారు. ఇంతలోనే అధికారుల బదిలీలతో తహసీల్దారు కార్యాలయంలోని తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్లగా వీఆర్‌వో పదవీ విరమణ చేశారు. కొత్తగా వచ్చిన తహసీల్దారుకు సమస్యను వివరించి వినతి పత్రం అందించగా ఆర్‌ఐకి రిపోర్ట్ తయా రు చేయమని ఆదేశించారు. బాధితులు ఆర్‌ఐ వద్దకు వెళ్లగా నెల రోజుల తరువాత పని అవుతుందని అప్పటి వరకు కార్యాలయానికి రావొద్దని సమాధానం ఇచ్చారు. ఇలా కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్న అధికారులను నిలదీసి అడగగా రూ.లక్ష లంచం ఇస్తేనే పని అవుతుందని మద్యవర్తులచే సమాచారం అందించారు.

తమ వద్ద అంత డబ్బు లేదు కనికరం చూపమని బాధితుడు వల్లూరు కృష్ణ మొరపెట్టుకోగా చివరగా రూ.50 వేలు ఇస్తే నే ఆన్‌లైన్‌లో భూమిని తన తండ్రి పేరుపై మార్చి విరాసత్ చేస్తామని సమాధానం ఇచ్చారు. లంచం ఇచ్చే స్తోమత లేకపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ భూమి వేరొకరి పేరుపై నమోదు కావడం వల్ల ప్రభుత్వం నుంచి రావల్సిన రైతుబంధు పథకం ఇతర సదుపాయాలు కోల్పోతున్నామని వల్లూరు కృష్ణ, నారం వీరేశ్‌లు వాపోతున్నారు. ఇలాంటి భూ సమస్యలు జోగుళాంబ గద్వాల జిల్లాలో లెక్కలేనన్ని ఉన్నా యి. బాధితులు ఎవరితో చెప్పుకోవాలో ఎక్కడ ఫిర్యాదులు చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. కన్నతల్లిలా అన్నం పెట్టే భూమి సమస్యల్లో చిక్కుకోవడంతో నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,46,679 ఎకరాలకు రైతుబంధు పథకం కింద రూ.4000 పంట సా యం అందుతుంది. భూ ప్రక్షాళనలో భాగంగా అధికారులు జిల్లాలో 20,590 ఖాతాలకు సంబంధించిన దాదాపు 50 వేల ఎకరాలకు పైబడిన భూములు బీ కేటగిరిలో ఉంచారు. ఈ ఖాతా దారులందరూ నిత్యం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. భూ సమస్యలు చిన్నవైనప్పటికీ వాటిని సత్వరకాలంలో పరిష్కారం చేయకుండా అధికారులు రైతులను ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. తిరిగి తిరిగి విసి గి వేసారిన రైతులు చివరు చేసేదేమి లేక అధికారులు డిమాండ్ చేసిన లంచం అందించి పనులు చేయించుకుంటున్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...