మోడల్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి


Thu,April 18, 2019 12:24 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : జిల్లాలోని వెల్దండ, కోడేరు మండలాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6,7,8,9,10 తరగతుల్లో ఉన్న ఖాళీల కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జిల్లాలోని కోడేరు, వెల్దండ మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నాగర్‌కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో, గీతాంజలి హైస్కూల్, లిటిల్ ఫ్లవర్, నేషనల్ హైస్కూళ్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 1050 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు.

ఇందుకోసం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, నేషనల్ హైస్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు గానూ 1232 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు పరీక్షల నిర్వాహణ కోసం బాధ్యతలు చేపట్టే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, వైద్యం అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో పరీక్షల నిర్వాహణాధికారి రాజశేఖర్‌రావు, సెక్టోరియల్ అధికారి అహ్మద్, విశ్వనాథ్, హరిప్రియ, లతాదేవి తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...