కమనీయం.. రమణీయం


Thu,April 18, 2019 12:24 AM

చారకొండ : అపర భద్రాదిగా పిలిచే శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టం పెద్ద రథోత్సవం బుధవారం వేకువజామున 4.30 గంటలకు ప్రారంభమై.. 6.30 గంటలకు ముగిసింది. వేలాది మంది భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ రథాన్ని లాగడానికి పో టీ పడగా.. రథోత్సవం కనుల పండువగా సాగింది. రథాన్ని లాగితే కోరిన కోరికలు నెరవేరుతావనే విశ్వాసంతో భక్తులు రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలొచ్చిన భక్తులతో శిరుసనగండ్ల కిక్కిరిసింది. రథోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రే భక్తులు గుట్టపైకి చేరుకున్నారు. భక్తుల్లో ఉత్సాహం నింపేందుకు వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు నాటికలు ప్రదర్శించారు. తెల్లవారుజామున వివిధ రకాల పూలతో అలంకరించిన పెద్ద రథానికి వేద పండితుల వేద మత్రోచ్ఛరణలతో పూజలు చేసి డప్పు వాయిద్యాలు, భక్తుల జైశ్రీరాం నామస్మరణల మధ్య రథాన్ని ముందుకు కదలించారు. గు ట్టపై ఉన్న ఇళ్లపై నుంచి భక్తులు రథోత్సవాని వీక్షించారు. ఆనంతరం సీతారామచంద్ర స్వాములను దర్శ నం చేసుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

భారీ బందోబస్తు..
బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్న రథోత్సవ ఘట్టంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఏఎస్పీ జోగుల చెన్నయ్య పర్యవేక్షణలో కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి, సీఐ నాగరాజు, స్థానిక ఎస్సై బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను గుట్టపైకి రాకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డేరం మల్లిఖార్జునశర్మ, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్ నిరంజన్, సర్పంచ్‌లు శారదశ్రీను, విజేందర్‌గౌడ్, ప్రశాంత్‌నాయక్, నరేందర్‌రెడ్డి, శ్రీను, సుజాత, ఎంపీటీసీ నర్సింహ్మరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీను, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గురువయ్యగౌడ్, నాయకులు మోహన్‌రెడ్డి, హరినాథ్‌రాజు, సందీప్‌రెడ్డి, రామకృష్ణ ఆలయ అర్చకులు సీతారామశర్మ, మురళిశర్మ, లక్ష్మణశర్మ, రాముశర్మ, వేణుగోపాల్‌శర్మ, ప్రవీణ్‌శర్మ, పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...