రాష్ట్రీయ కిశోర్ స్వస్తిక్ అమలుపై పరిశీలన


Thu,April 18, 2019 12:24 AM

జడ్చర్ల టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ కిశోర్ స్వస్తిక్ కార్యక్రమం అమలవుతున్న విధానాన్ని పరిశీలించడానికి ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఆర్‌కేఎస్ బృందం బుధవారం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్‌కేఎస్ సెంటర్‌ను సందర్శించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాష్ట్రీయ కిషోర్ స్వస్తిక్ కార్యక్రమ స్పెషలిస్ట్ సోంఫాల్ నేతృత్వంలో ఆ రాష్ర్టానికి చెందిన ఆర్‌కేఎస్ కోఆర్డినేటర్లు మనోజ్‌శుక్లా, ఇంద్రజిత్‌సింగ్, ఆనంద్ ఆగర్వాల్ పరిశీలించారు. ప్రతి రోజు కౌన్సిలింగ్ సెంటర్‌కు ఎంత మంది కిషోర బాలికలు వస్తారని, వారికి ఏ విధమైన ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పిస్తారని స్థానిక ఆర్‌కేఎస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న బాలికలకు ఏ విధమైన వైద్య చికిత్సలు, పౌష్టికాహారం అందిస్తారన్న వివరాలు తెలుసుకున్నారు. ప్రతి కిషోర బాలికను వైద్య పరీక్షలు చేసి, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరిస్తామని సిబ్బంది చెప్పారు. ప్రత్యేకంగా ఒక కార్డులో ప్రతి కిషోరబాలికకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తామని బృందానికి తెలిపారు. కౌన్సెలింగ్ సెంటర్‌తో పాటు బయట పాఠశాలలు, వసతిగృహాల్ల్లో కిషోరబాలికలకు ఆరోగ్యానికి సంబందించిన విషయాలను తెలియజేస్తామని యూపీ బృందానికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ సౌమ్య, జిల్లా కోఆర్డినేటర్ శశికాంత్ యూపీ బృందానికి రాష్ట్రీయ కిషోర్ స్వస్తిక్ కార్యక్రమం అమలవుతున్న విధానాన్ని గురించి క్షుణ్ణంగా వివరించారు.అంతకు ముందు జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని యూపీ బృందం సభ్యులు పరిశీలించారు. అక్కడ పిల్లలకు ఇస్తున్న పౌష్టీకాహారం, పిల్లలకు ఆరోగ్యపరంగా ఏలాంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయాలను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను యూపీ బృందం మెచ్చుకుంది. ప్రధానంగా గర్భీణీ మహిళలకు అందిస్తున్న పథకాలతో పాటు కేసీఆర్ కిట్ పథకం ఎంతో బాగుందని యూపీ బృందం అభినందించింది.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...