28న పోలీస్ రాత పరీక్ష


Thu,April 18, 2019 12:24 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఈనెల 28వ తేదీన పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలమూరు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో పాలిటెక్నిక్ కళాశాల కోఆర్డినేటర్ నాగరాజు సమక్షంలో పరీక్షల పరీక్షల సిబ్బందితో ఎస్పీ సమావేశమై మాట్లాడారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు, నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు నియమ నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించవద్దని ఎస్పీ సూచించారు. ప్రతి అభ్యర్థి తమ హాల్ టికెట్‌పై లేటెస్ట్ ఫొటోను అటాచ్ చేసుకొని పరీక్షకు హాజరుకావాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తులు పరీక్ష హాల్‌లోకి అనుమతించబడవన్నారు. నకిలీ అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా డిజిటల్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల థంబ్‌ను తీసుకుంటామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్ జిల్లా కో ఆర్డినేటర్ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 9,988 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏఏస్పీ వెంకటేశ్వర్లు, పాలిటెక్నిక్ కళాశాల కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, అధికారులు సాయిమనోహర్, తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...