కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు


Wed,April 17, 2019 01:25 AM

-శ్రీరామచంద్ర స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు
-నేడు తెల్లవారుజామున పెద్ద రథోత్సవం
చారకొండ : మండలంలోని అపర భద్రాది శిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వా మి బ్రహ్మోత్సవాలు నాల్గోరోజు మంగళవారం కొనసాగా యి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రా త్రి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకీలో ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం సీతారామచం ద్ర స్వామి ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం, సంహస్రనామర్చన, సీతమ్మకు కుంకుమార్చన, పరుశురాముడికి ప్రత్యేక పూజలు చేశారు. పలు ఉప ఆలయాలు ఆంజనేయ స్వామి, పోచమ్మ, శివాలయం, మైసమ్మ దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం తర్వాత పెద్ద మొత్తంలో భక్తులు హాజరయ్యే కార్యక్రమం పెద్దరథోత్సవం (బ్రహ్మోత్సవం) బుధవారం తెల్లవారుజామున నిర్వహించనున్నారు. పెద్ద రథోత్సవంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బ్రహోత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ నాగరాజు, ఎస్సై బాలకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఢేరం మల్లికార్జునశర్మ, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్ నిరంజన్, సర్పంచ్‌లు శారదశ్రీను, వి జేందర్‌గౌడ్, ప్రశాంత్‌నాయక్, నరేందర్‌రెడ్డి, శ్రీను, సుజాత, ఎంపీటీసీ నర్సింహ్మరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గు రువయ్యగౌడ్, ఆలయ అర్చకులు సీ తారామశర్మ, మురళిశర్మ, లక్ష్మణశర్మ, వేణుగోపాల్‌శర్మ, ప్రవీణ్‌శర్మ పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...