మలేషియా ఎన్నారై సేవలు అభినందనీయం


Wed,April 17, 2019 01:25 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ: ఏజెంట్ల చేతిలో మోసపోయిన భాదితులకు, అనుకోకుండా మరణించిన వారి పార్థివ దేహాలను స్వదేశానికి తరలించడంలో తెరాస మలేషియా ఎన్నారై విభాగం చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మలేషియాలోని వ్యవసాయ క్షేత్రాల అధ్యయనానికి వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడి రైతులు అవలంబిస్తున్న అత్యాధునిక పద్ధతులను స్వయంగా పరిశీలించి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా సందర్శించారు. అనంతరం టీఆర్‌ఎస్ మలేషియా ఎన్నారై విభాగం ఆధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌలాలంపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు మంత్రి నిరంజన్ రెడ్డికి టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నిరంజన్ రెడ్డి తన అనుభవాలను న్నారైలతో కలసి పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... విదేశీయుల చేతిలో మోసపోయిన బాధితులకు టీఆర్‌ఎస్ మలేషియా ఎన్నారై విభాగం అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తెరాస మలేషియా హెల్ప్‌లైన్ నెంబర్ + 601118772234 ద్వారా ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు స్పందిస్తున్నామని అక్కడి టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం మంత్రికి వివరించింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై సంఘం ఉపాధ్యాక్షుడు మారుతీకుర్మ, జనరల్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగిల అరుణ్, రమేష్, బోయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, జీవన్, రమేష్, సందీప్‌కుమార్, సత్యనారాయణ, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవిందర్ ఇతర సభ్యులు తదితరులు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...