ఒకేరోజు 16 ప్రసవాలు


Wed,April 17, 2019 01:25 AM

మక్తల్, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తుండటంతో రోజురోజుకీ ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. మక్తల్ ప్రభుత్వ దవాఖానలో మంగళవారం 17 ప్రసవాలు జరగగా.. 14 సిజేరియన్లు, 3 నార్మల్ డెలీవరిలని నారాయణపేట డీఎంఅండ్‌హెచ్‌వో డా. సౌభాగ్యలక్ష్మి తెలిపారు. వీరిలో 12 మంది ఆడ శిశువులు, 5 మంది మగ శిశువులు ఉన్నారనీ, ఇద్దరు మగ శిశువులు గ్రహణమొర్రి (అంగవైకల్యం)తో జన్మించారని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలతో పాటు సిజేరియన్లు సైతం చేస్తున్నామని డీఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులను ఏర్పాటు చేసి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండే విధంగా నేడు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రసవాల సంఖ్యలో జిల్లాలోనే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానంలో ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...