భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు


Wed,April 17, 2019 01:25 AM

- తాగు నీటి వసతిపై ప్రత్యేక దృష్టి
-అచ్చంపేట డిపో నుంచి 50 ప్రత్యేక బస్సులు
-సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
- జాతర ఏర్పాట్లపై అధికారులతో ఆరా ..
అమ్రాబాద్ రూరల్: సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఐటీడీఏ పీవో, అధికారుల బృందంతో కలిసి ఆయన సలేశ్వరం లింగమయ్యను దర్శించుకున్నారు. ఉదయం 6 గంటలకు మన్ననూర్ గ్రామానికి చేరుకున్న జేసీ అక్కడ నుంచి సలేశ్వరానికి వెళ్లేందుకు ఉదయం 7:30 గంటలకు రాంపూర్ పెంట వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి కాలినడకన సలేశ్వరం చేరుకొని పూజలు చేశారు. ఈసందర్భంగా జాతర కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉదయం 11 గంటలకు తిరిగి రాంపూర్ పెంటకు చేరుకున్న జేసీ అక్కడ విలేకరులతో మాట్లాడారు. నల్లమలలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాలు ఈ నెల 18 నుంచి అధికారికంగా ప్రారంభమవుతాయనీ, కలెక్టర్ శ్రీధర్ ఆదేశం మేరకు ఐటీడీఏ పీవో, ఇతర అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించామన్నారు. జాతరకు తరలివచ్చే భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని వివరించారు.

వేసవి కావడంతో భక్తులకు మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారు లు చర్యలు చేపట్టారని తెలిపా రు. నిండు పౌర్ణ మి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రాను న్న నేపథ్యంలో గుండం వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్న సేవా ట్రస్టులకు భోజనాలు చేసే స్థలం దుమ్ముదూళి లేకుండ ఉండేందుకు ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచామన్నారు. జాతరకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం అచ్చంపేట డిపో నుంచి 30 బస్సులు, 20 మినీ బస్సులు నడుపుతున్నామని డీఎం నారాయణ జేసీకి వివరించారు. అత్యవసర వైద్యానికి ఏర్పాట్లుజాతరకు తరలివచ్చే భక్తులకు అత్యవసర చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటదాసు తెలిపారు. పరహబాద్, రాంపూర్ పెంట, గాడ్దుల దిన్నే కాలువ, లింగల మండల పరిధిలోని అప్పాపూర్, గిరిజ గుండాల వద్ద ప్రాంతాల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నల్లమలమలోని రహదారికి మరమత్తులు చేసి రాక పోకలకు ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...