అపూర్వ సమ్మేళనం!


Wed,April 17, 2019 01:24 AM

-56 ఏళ్ల తర్వాత కలుసుకున్న గాంధీరోడ్ స్కూల్ పూర్వ విద్యార్థులు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : వారంతా డ్బ్బై ఆరేడ్లకు పైబడిన వారే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేసి పదవీ విరమణ పొందిన వారు కొందరైతే వ్యాపార, రాజకీయ రంగాల్లో స్థిరపడిన వారు మరికొందరు. అందరు కలిసి మంగళవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. 56 ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ చదువుకున్న విద్యార్థులంతా మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగోండలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాటి మధుర క్షణాలను స్మరించుకుంటూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగ క్షేమాలను తెలుసుకుంటూ తన్మయత్వానికి లోనయ్యారు. 1963 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన నర్సింహ్మారెడ్డి, బాలయ్య, ముత్యాల ప్రకాష్, రాఘవులు గౌడ్, తదితరులు గాంధీరోడ్డు ఉన్నత పాఠశాలలో చదివిన తమ బ్యాచ్ సహచారుల సమాచారాన్ని సేకరించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...