ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లోకి..


Wed,April 17, 2019 01:24 AM

-మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి
- టీఆర్‌ఎస్‌లో చేరిన ముదిరెడ్డిపల్లి కాంగ్రెస్ నేతలు
రాజాపూర్ : టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే సీ.లకా్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. లకా్ష్మరెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీ కార్యకర్తలతో పాటు, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. ఉమ్మడి బాలానగర్, రాజాపూర్ మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించామని అన్నారు. మండల పరిషత్ ఎన్నికల తర్వత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. కార్యక్రమంలో రాయపల్లి సర్పంచ్ గంగాధార్‌గౌడ్, ముదిరెడ్డిపల్లి సర్పంచ్ పెంటయ్య, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, శ్రీనివాసులు, మల్లేశ్, రాజు, స్వామి, కృష్ణ, సత్యయ్య, రాములు, శివకుమార్, ఆంజనేయులు, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...