రెండు కార్లు ఢీ.. ఐదుగురికి గాయాలు


Wed,April 17, 2019 01:24 AM

మూసాపేట : ముందు వెళ్తున్న కారును మరో కారు ఢీ కొన్న సంఘటనలో ఐదుగురికి గాయాలైన సంఘటన మూసాపేట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన కిషోర్‌కుమార్ కుటుంబ సభ్యులతో కడప నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి మార్గ మధ్యలో వనపర్తి జిల్లా కనిమెట్ట వద్ద ఉన్న ఫుడ్‌ప్లాజా వద్ద రాత్రి సేదతీరి మంగళవారం తెల్లవారుజామున బయలుదేరారు. మూసాపేట జాతీయ రహదారిపైకి రాగానే వెనక నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న కిషోర్‌కుమార్ కాలుకు గాయం కావడంతో పాటు, భార్య సింధుకు ముఖంపై బలమైన గాయమై తీవ్రంగా రక్తస్రావమైంది. కుమారుడు అజయ్ చేతికి, కూతురు తలకు బలమైన గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ మధుసుదన్‌గౌడ్ చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...