ట్రాక్టర్‌ను ఢీ కొన్న కారు


Wed,April 17, 2019 01:23 AM

-ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
-ముగ్గురికి గాయాలు
-తప్పిన పెను ప్రమాదం
మూసాపేట : ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాల య్యాయి. ఈ ఘటన మండల పరిధిలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై మధుసుదన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సూర్తితండాకు చెందని ముడావత్ కిష్ట్య (40)కు సిమెంట్ కాంక్రిట్ మిల్లు ఉంది. అతని మిల్లర్ మూసాపేటలో ఉండడంతో తీసుకు రావడానికి ట్రాక్టర్‌తో తీసుకెళ్లటానికి హైదరాబాద్ వైపు నుంచి మూసాపేటకు వస్తున్నాడు. మార్గ మధ్యలో మూసాపేట జాతీయ రహదారి వద్దకు రాగానే ఆంద్రపదేశ్ రాష్ట్రంలోని కడపకు చెందిన కృష్ణారెడ్డితో పా టు, మరో వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తూ వెనక నుంచి ట్రాక్టర్‌ను వేగంగా ఢీ కొట్టాడు.

దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొని బోల్తా పడింది. దీం తో ట్రాక్టర్ డ్రైవర్ కిష్ట్య అక్కడి కక్కడే మృతి చెందగా, ట్రాక్టర్‌పై ఉ న్న హన్మంతుకు కాలు విరగడంతో పాటు, తీవ్రంగా గా యపడ్డాడు. అతన్ని చికిత్స ని మిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. అదేవిధంగా ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారులో ఎయిర్‌బ్యాగ్స్ బయటకు రావడంతో అ ందులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగంగ పూర్తి గా ధ్వంసమైంది. కారు రోడ్డు మధ్యలో నిలిచిపోడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ మధుసుదన్‌గౌడ్ సంఘటన స్ధలానికి చేరుకుని రోడ్డు మధ్యలో ఉన్న వాహనాలను తొలగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసుదన్‌గౌడ్ తెలిపారు. కిష్ట్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ధవాఖానకు తరలించారు.

తప్పిన పెను ప్రమాదం
ట్రాక్టర్‌ను కారు ఢీ కొన్న సమయంలో ట్రాక్టర్ డీజల్ ట్యాంక్ పగిలిపోయి అందులో ఉన్న డీజిల్ బయటకు విరజిమ్మింది. ఆ సమయంలో మంటలు వ చ్చి ఉంటే ట్రాక్టర్ తో సహ అందులో ఉ న్నవారందరూ కాలిపోయేవారు. అంతే కాకుండా కారు డిక్కీలో సిలిండర్ ఉంది. కారు ఢీ కొట్టిన సమయంలో ఆ సిలిండర్ పేలి ఉంటే కారుతో పాటు, ట్రాక్టర్ కాలిపోయి ఉండేది. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పి ందని స్థానికులు తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...