ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలి


Tue,April 16, 2019 02:59 AM

అమ్రాబాద్ రూరల్ : ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఎంత సాయం చేయగలం అనే ఆలోచన కలిగి ఉండాలని రూరల్ డెవలఫ్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆర్ట్స్ అండ్ కల్చర్ డైరెక్టర్ ఎం.నిర్మల్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని ప్రాశాంత్‌నగర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ ముందర ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెరర్ 99వ జయంతి వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై గ్రామస్తులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ పేద వర్గాల అభ్యున్నతి కోసం తనవంతు సహకరాం అందిస్తుందన్నారు. మొదటి సంవత్సరంలో 43వేల 817 హుండీల ద్వారా రూ. 97లక్షల 63వేల 21 ఆదాయం సమకూరిందని, దీంతో 62 లక్షలతో 289 మంది అనాథ పిల్లల విద్యా, వైద్యం కోసం ఖర్చు చేసామన్నారు. 2018 నాటికి ఏడు సంవత్సరాల్లో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలలో 7 లక్షల 4వేల 506 హుండీల ద్వారా రూ. 7 కోట్లు సోమ్ము సమకూరిందన్నారు. అట్టి సోమ్ముతో రెండు రాష్ర్టాల్లో ఉన్న అనాథ పిల్లల చదవు, ఆరోగ్యంంతో పాటు ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రశాంత్ నగర్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేదలకు 61 మందికి పక్కగృహలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విన్సెంట్ ఫెరర్ 99వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ప్రశాంత్ నగర్‌లో గ్రామస్తులు నెలకు ఒక్క రూపాయి చొప్పున సంవత్సరం పాటు పోగు చేసిన 80 హుండీల ద్వారా రూ. 35వేల డబ్బులను అనాథ పిల్లల సంక్షేమం కోసం అందజేశారు. తదుపరి మన్ననూర్ గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో 250 హుండీల ద్వారా రూ. 79 వేలు పోగుచేశారని తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీటీ ఏరియా కో ఆర్డినేటర్ సరస్వతి, డాక్టర్ సైపుల్లాఖాన్, ఎస్‌టీఎల్ మంజూనాథ్, స్థానిక ఆర్డీటీ ఆర్గనైజర్లు గోవిందు, సరస్వతి, రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. విజ్ఞాన తెలంగాణగా తీర్చిదిద్దుదాం కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం సర్కారు బడులను బలోపేతం చేయడంతో పాటు పాఠశాలలో మౌళిక వసతులు కల్పిస్తోందని విద్యార్థులు చక్కగా చదువుకుని తెలంగాణను విజ్ఞాన తెలంగాణగా తీర్చిదిద్దాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు.

సోమవారం రాత్రి కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామంలో హెచ్‌ఎం చంద్రశేఖర్ ఆధ్యక్షతన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నాగర్‌కర్నూల్ డీఈఓ గోవిందరాజులు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాల వార్షికోత్సవాన్ని గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లింగసానిపల్లి పాఠశాల మండలంలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చడంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ప్ర జాప్రతినిధుల కృషి చాలా ఉందని అ న్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు, సదుపాయాలు ఉన్న ప్ర భుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నతంగా ఎదగాలని కోరారు. విద్యావ్యాప్తితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యార్థులు ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి,చిన్నారులను ఎమ్మెల్యే, డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ పరుశురాములు, ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి, నాయకులు ఎడ్మసత్యం, షాన్‌వాజ్‌ఖాన్, మనోహర్‌రెడ్డి, గోవర్దన్, శ్రీకృష్ణమాచారిలతో పాటు యూటీఎఫ్ నాయకులు, జేవీవీ నాయకులు రమేశ్, పాఠశాలల హెచ్‌ఎంలు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...