నేటి నుంచే పాలిసెట్ పరీక్ష


Tue,April 16, 2019 02:58 AM

- జిల్లా కో ఆర్డినేటర్ మధుసూదన్‌శర్మ
నాగర్‌కర్నూల్ రూరల్ : పాలిసెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కో ఆర్డినేటర్ మధుసూదన్‌శర్మ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాలిసెట్ పర్యవేక్షణాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం 11గంటల నుంచి 1గంట వరకు పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలకు పది మంది పర్యవేక్షణాధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 2494 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. విద్యార్థులకు పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ముందస్తుగా ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీటి సౌకర్యంతో పాటు పరీక్ష సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పోలీస్ శాఖ నుంచి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు జరుగకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా పరీక్షల పర్యవేక్షణాధికారులకు పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ పత్రాలను అందించారు. పాలిసెట్ పరీక్షపై తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. సమావేశంలో అడిషనల్ కో ఆర్డినేటర్ వెంకట ప్రసాద్, పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...