నెలాఖరుకే పాఠ్యపుస్తకాలు


Tue,April 16, 2019 02:58 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేయాల్సిన పాఠ్యపుస్తకాలు ఏప్రిల్ నెలాఖరుకే అన్ని మండ ల కేంద్రాలకు చేరనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో ని ర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. రానున్న విద్యా సంవత్సరానికి అవసరమై న పాఠ్య పుస్తకాలను పకడ్బందీగా పాఠశాలకు ప ంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చ దివే ప్రతి విద్యార్థికీ పాఠ్య పుస్తకాలు అందేలా మండల అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులు అందించేందుకు ప్రతి మండల కేంద్రానికి అందుకు సంబంధించిన బట్ట త్వరలోనే మండల కేంద్రాలకు చేరుకుంటుందన్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని ఎంఈవోలకు డీఈవో సూచించారు. అంతకు ముందు కస్తూర్బా బాలికల వి ద్యాలయం ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహి ంచారు. అన్ని కేజీబీవీల్లో ఇంటర్నెట్ తరగతులకు, వి ద్యాసంవత్సరానికి సంబంధించిన నమోదుపై చర్చించారు. ఈ సమావేశంలో ఏడి ఖాజా ఫకీర్‌బేగ్, సెక్టార్ అధికారి అహ్మద్, నోడల్ అధికారి కుర్మయ్య, ఏసి రాజశేఖరరావు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...