ప్రారంభమైన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు


Tue,April 16, 2019 02:58 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. చైల్డ్‌హుడ్, చైల్డ్ డెవలప్‌మెంట్, లర్నింగ్ సబ్జెక్టు పరీక్షకు మొత్తం 296 మంది అభ్యర్థులకు గాను 280 మంది హాజరుకాగా 16 మంది గైర్హాజరయ్యారు. జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు, పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖరరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయన్నారు. మంగళవారం నుంచి రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహి ంచనున్నట్లు ఆయన తెలిపారు. ఒక రోజు మొదటి, మరుసటి రోజు రెండో సంవత్సరం పరీక్షలు ఉంటాయని, ఈనెల 29 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆయెషా ఫాతిమ, జలీల్‌లు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...