వైభవంగా..రాములోరి కల్యాణం


Mon,April 15, 2019 01:59 AM

ఇటిక్యాల : వేదపండితుల మంత్రోత్సరణలతో కన్నుల పండువగా కోదండరాముల వారి కల్యాణం.. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు పవిత్ర బీచుపల్లి క్షేత్రములోని కోదండరామాలయంలో ఆదివారం పుష్యమి నక్షత్రయుక్త కర్కాటక లగ్నమున శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్ర మూర్తికి, సీతామహాలక్ష్మికి వేదపండితులు మంత్రోత్సారణలతో కన్నుల పండువగా కల్యాణంను జరిపించారు. అత్యంత వైభవంగా సాగిన కల్యాణ వేడుకలను తిలకించుటకు ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి కల్యాణవేడులను తిలకించారు. అంతకుముందు స్వామివారికి ప్రభోదకి, చతుస్థానార్చన బలిహారణం నిర్వహించారు. అనంతరం స్వామివారిని శేషవాహనంపై ఊరేగింపుగా కల్యాణ మండపమునకు తీసుకొచ్చారు. కల్యాణ మండపంలో వేదపండితులు నర్సింహమూర్తి బృందం, శేషబట్టర్ వారి బృందం ధర్మమార్గ అనుసారంగా పరిపాలన కొనసాగించాలని ఆకాంక్షిస్తూ లోక పరిరక్షణకోసం స్వామివారికి పట్టు వస్త్రములను సమర్పించారు. మాంగల్యం తంతునానేనా లోక రక్షణ హేతునాం అంటూ కంటే బద్నామి శుభగేష్యం జీవాశరధం శతం అంటూ వేదమంత్రోత్సరణలతో సీతమ్మ వారి మెడలో రామయ్య మాంగల్యధారణ గావించారు.

మాంగల్యధారణ అనంతరం ప్రజలందరూ ధనధాన్యములతో సుభిక్షంగా ఉండాలంటూ వేద పండితులు తలంబ్రాల ఘట్టాన్ని ముగించారు. స్వామివారి కల్యాణ వేడుకలను పురష్కరించుకొని ఉదయాన్నె విచ్చేసిన భక్తులు కళ్యాణ మండపంలోఏర్పాటు చేసిన నీడవసతిలో ఆశీనులై భక్తిశ్రద్దలతో స్వామివారి కళ్యాణ వేడుకలను తిలకించారు. కల్యాణ వేడుకలను, ఆలయ కార్యదర్శి, సీతారాంరెడ్డి, కమిటీ సభ్యులు, సోమనాద్రిరెడ్డి, జింకలపల్లె భీమేశ్వర్‌రెడ్డి దంపతులు తిలకించారు. గతంలో ఎన్నడు రానంతగా సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈవేడులకు తిలకించి స్వామివారికి పట్టు వస్ర్తాలు తలంబ్రాలు సమర్పించి చల్లగా చూడాలని వేడుకొన్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. ఆలయ కార్యదర్శి సీతారామిరెడ్డి కల్యాణ వేడుకలకు విచ్చేసిన భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తదితరులు పర్యవేక్షించారు. అలాగే కల్యాణ వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటిక్యాల పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు. గద్వాల ప్రభుత్వ కళాశాలకు చెందిన 30 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, పూడూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు భక్తులకు తాగునీరు, భోజన వసతి సదుపాయాలు కల్పించుటలో సేవలందించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...