హజ్ నియమాలు పాటించాలి


Mon,April 15, 2019 01:58 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : హజ్ యా త్రకు వెళ్లే వారు తప్పకుండా హజ్ ని యమాలను పాటించాలని మౌలానా మొహమ్మద్ తస్లీమ్ ఖాద్రీ అన్నారు. హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్ ఫంక్షన్ హాలులో హజ్ యాత్రికులకు శిక్షణా కా ర్యక్రమం నిర్వహించారు. జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు షేఖ్ ఫరీద్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ శిక్షణా శిబిరంలో తస్లీమ్ ఖాద్రీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హజ్ యాత్ర పవిత్రమైందని, యాత్రకు సంబంధించిన పూర్తి నియమనిబంధనలు పాటించినప్పుడే హజ్ యాత్ర సంపూర్ణమవుతుందన్నారు. యాత్రలో పాటించాల్సిన ని యమాలు, అనుసరించాల్సిన పద్ధతులను సెంట్రల్ హజ్ సొసైటీ శిక్షకులు అల్హాజ్ నజీర్ అహ్మద్, ఆరీఫ్ అహ్మద్ కాబా నమూనాను ప్రదర్శించి ప్రాక్టికల్‌గా శిక్షణ అందజేశారు. ఈ శిక్షణ కా ర్యక్రమంలో పట్టణ మసాజిద్ కమిటీ అధ్యక్షుడు ఖాజాఖుతుబుద్దిన్, కార్యద ర్శి ముస్తాఖ్ అహ్మద్, జామా మసీదు అ ధ్యక్షుడు హనీఫ్, మసీద్ కమిటీ మా జీ అధ్యక్షుడు హఫీజ్‌ఖాన్, హజ్ సొసై టీ కార్యదర్శి ఇబ్రహీం, సభ్యులు అబ్దుల్‌హాక్, హాఫిజ్ మహబూబ్‌అలి, ముబీ న్ అహ్మద్‌ఖాన్, షుకూర్, అజీమ్, అమ్జదుల్లాహుసేనీ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...