ఘనంగా అంబేద్కర్ జయంతి


Mon,April 15, 2019 01:58 AM

- అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన జక్కా
నాగర్‌కర్నూల్ టౌన్ : డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకల ను జిల్లా కేంద్రంలో ఘ నంగా నిర్వహించారు. జి ల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి నల్లవెల్లి కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మోహన్‌గౌడ్, పలువురు కౌన్సిలర్లు, దళిత, ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యుత్ సంఘాల నాయకులు, జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఎంఈవోలు రాజశేఖర్‌రావు, హెచ్‌ఎం కుర్మయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఛైర్మన్ మోహన్‌గౌడ్, మండలాధ్యక్షుడు సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు ఖాజాఖాన్, శ్రీను, నాయకులు ఈశ్వర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, తిరుమల్‌యాదవ్, రామక్రిష్ణారెడ్డి భాస్కర్‌గౌడ్, ఇమ్రాన్, సంతోశ్, షఫీఖాన్, పాపమ్మ, దళిత సంఘాల నాయకులు ధర్మరాజు, సీపీఎం, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, నాయకులు భగవంత్‌రెడ్డి, విద్యుత్ ఉద్యోగ 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...