విద్యతోనే కుల అసమానతలు తొలగుతాయి


Mon,April 15, 2019 01:58 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : విద్యతోనే కుల అసమానతలు తొలుగుతాయని బలంగా నమ్మిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని, వారి ఆశయాలకు అ నుగుణంగా నడుచుకోవడమే వారికి అందించే నిజమైన నివాళి అని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొదటగా జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, సా యి గార్డెన్స్‌లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అక్కడ జ్యోతి ప్రజ్వలన అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. విద్యతోనే అసమానతలు, కుల వివక్షత తొలుగుతాయని అంబేద్కర్ బలం గా నమ్మేవారని, అందుకే చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసంపైనే ఎక్కువ శ్రద్ధ వహించేవారని పేర్కొన్నారు.

బరోడా మహారాజుశాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చి 25రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బీ.ఏ పరీక్షల్లో నెగ్గారన్నారు. 1913లో కొలంబియా విశ్వ విద్యాలయంలలో చేరి 1915 లో ఎం.ఏ, 1916లో పీహెచ్‌డీ, డిగ్రీలను పొందారన్నారు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్సియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అను పేరుతో ప్రచురించబడిందన్నారు. 1917లో డా.అంబేద్కర్‌గా స్వదేశం వచ్చాడని, అప్పటి అతని వయస్సు 27ఏళ్ళు అన్నారు. రాజ్యాంగం నిర్మించడంలో ముఖ్యభూమిక పోషించిన అంబేద్కర్ లాంటి మహానీయుడికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలన్నారు. అంతకు ముందు షెడ్యూల్ కుళాల పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి అఖిలేష్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.అంజిలప్ప, జిల్లా అధికారులు మోహన్‌రెడ్డి, అనిల్‌ప్రసాద్, వివిధ సంఘాల దళిత నాయకులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...