ఆర్టీసీ బస్సులో గిరిజన మహిళ ప్రసవం


Sun,April 14, 2019 02:53 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ/ వనపర్తి వైద్యం : ఓ గిరిజన మహిళ కాన్పు కోసం ఆస్పత్రికి ఆర్టీసీ బస్సు లో వనపర్తికి వెళ్తుండగా మార్గమద్యంలో పురటినోప్పులు ఎక్కువకావడంతో మానవతాదృక్పదంతో డ్రై వర్ రోడ్డు పక్కన చెట్టు నీడన బస్సు ను ఆపాడు.దీంతో బస్సులోని ప్ర యాణికులందరూ కిందకు దిగగా బ స్సులో ఉన్న మహిళలు ఆ గర్భావతికి పురుడుపోయడంతో ఐదో కా న్పులో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా రు.108 అంబులెన్స్‌కు సమాచారం అందడంతో తల్లిబిడ్డను వనపర్తి జిల్లా దవాఖానాకు ముందుజాగ్రత్తగా తరలించారు.ఆర్టీసీ బస్సు డ్రైవ ర్ రవీందర్‌గౌడ్,కండక్టర్ మహేష్‌చారి కథనం ప్రకారం వివరాలు ఇ లాఉన్నాయి. కొల్లాపూర్ ఆర్టీసీ డి పోకు చెందిన 3866 నంబర్ బస్సు లో శుక్రవారం మధ్యాహ్నం కొల్లాపూర్ నుంచి వనపర్తికి బస్సు బయలుదేరింది.పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన గిరిజన మహిళ సాలి(30)కి ఇదివరకే నల్గు రు ఆడపిల్లలున్నారు.

మగబిడ్డ కోస ం నిరీక్షించిన సాలి ఐదోసారి గర్భావతి అయింది.అయితే సదరు గిరిజన మహిళ సాలికి 9నెలలు పూర్తికావడంతో వనపర్తి దవాఖానాలో పు రుడుపోసుకోవడానికై తన భర్తతో కలిసి ఆర్టీసీ బస్సును తెల్లరాళ్లపల్లి త ండా వద్ద ఎక్కారు.పాన్‌గల్ దాటిన తరువాత పురటినోప్పులతో పడుతున్న ప్రసవవేదనను కళ్లారా చూసి న డ్రైవర్,కండక్టర్ చలించిపోయి బస్సును రోడ్డు పక్కన చెట్టుకింద నిలిపివేశారు.ప్రయాణికులు కిందకు దిగగా బస్సులో ఉన్న మహిళ ప్రయాణికుల సహాకారంతో గిరిజన మహిళ సాలి ఐదో కాన్పులో మగబిడ్డకు సుఖప్రసవం అయింది.దీంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఎందుకైనా మంచిదని ముందుచూపుతో 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు.వెంటనే అంబులెన్స్ సిబ్బంది వచ్చి తల్లి బిడ్డను వనపర్తికి తరలించారు. గిరిజన మహిళ బస్సులో ప్రవసం కావడానికి సహాకరించిన బస్సు డ్రైవర్ కే,రవీందర్‌గౌడ్,కండక్టర్ మహేష్‌చారి ని ప్రయాణికులు అభినందించారు.ఈ విషయం తెలుసుకున్న కొల్లాపూర్ ఆర్టీసీ డిఎం బీ,వరప్రసాద్‌గౌడ్,స్థానిక బస్టాండ్ కంట్రోలర్ విజయకుమార్ డ్రైవర్,కండక్టర్‌ని ప్రశంసించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...