నేటి నుంచి వేసవి సెలవులు


Sun,April 14, 2019 02:52 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలువులు ప్రకటించినట్లు డీఈవో గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవుల అనంతరం జూన్ 1న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయన్నారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నాగర్‌కర్నూల్ జిల్లాలో పనిచేసే ఉపాధ్యాయులు ఇతర జిల్లా పాఠశాలల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు చివరి రోజైన ఈరోజు తమతమ పాఠశాలల యందు రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. రిపోర్టు చేయని ఉపాధ్యాయుల వివరాలను డీఈవో కార్యాలయానికి ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు అందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన వేసవి సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు తరగతులను నిర్వహిస్తే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...